4వ రోజు కృష్ణాలో జెర్సీ , కాంచన 3 కలెక్షన్స్ !

Published on Apr 23, 2019 1:55 pm IST

నాని నటించిన జెర్సీ , లారెన్స్ నటించిన కాంచన 3 తెలుగు రాష్ల్రాలో బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. వీకెండ్ లో భారీ వసూళ్లను రాబట్టిన ఈ రెండు చిత్రాలు వీక్ డేస్ లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి. దాంతో ఈ రెండు చిత్రాలు ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కు క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

ఇక జెర్సీ నాలుగవ రోజు కృష్ణా లో 10, 83,840 షేర్ తో 4రోజుల్లో అక్కడ 87,63, 114 షేర్ ను కలెక్ట్ చేయగా కాంచన 3 నిన్న కృష్ణా లో 9,75,014 షేర్ ను రాబట్టి 4రోజుల్లో 79,02,558 షేర్ ను కలెక్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి జెర్సీ ని డైరెక్ట్ చేయగా లారెన్స్ ,కాంచన 3 ని తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం :