జెర్సీ ,మజిలీ , చిత్రలహరి లేటెస్ట్ కృష్ణా కలెక్షన్స్ !

Published on Apr 25, 2019 9:57 am IST

నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకొని మొదటి వారాంతం బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చాక నెమ్మదించింది ఈ చిత్రం. దానికి తోడు కాంచన 3 కూడా ఈ చిత్రానికి గట్టిపోటీనివ్వడంతో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది . ఇక కృష్ణా లో నిన్న ఈ చిత్రం 6.37 లక్షల షేర్ తో 6రోజుల్లో 1.02కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక ఈ చిత్రం కంటే ముందు విడుదలైన మజిలీ , చిత్రలహరి బాక్సాఫీస్ వద్ద రన్ ను ముగించేదిశగా సాగుతున్నాయి. మజిలీ నిన్న కృష్ణా లో 63,022 షేర్ తో 20రోజుల్లో 1.76 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా చిత్రలహరి నిన్న 15,549 షేర్ తో 13రోజుల్లో అక్కడ 75.04 లక్షల షేర్ ను రాబట్టింది. కాగా మజిలీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకోగా చిత్రలహరి మాత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరగ వచ్చి ఆగిపోయింది. దాంతో ఈ చిత్రం సాయి ధరమ్ కెరీర్ లో డీసెంట్ సినిమా గా మిగిలిపోయింది కానీ ఆయనకు అవసరమైన విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.

సంబంధిత సమాచారం :