జెర్సీ సెన్సార్ కంప్లీట్ !

Published on Apr 15, 2019 9:16 pm IST

మచ్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఒక్క కట్ చెప్పకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు శిల్పకళావేదికలో జరుగనుంది. ఈ ఈవెంట్ కు వెంకటేష్ ముఖ్య అతిథిగా రానున్నారు.

గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :