‘జెర్సీ’కి 4 మిలియన్ వ్యూస్ !

Published on Apr 13, 2019 1:14 pm IST

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘జెర్సీ’.

కాగా ఈ చిత్రం నుండి నిన్న విడుదలైన ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో జెర్సీ ట్రైలర్ కు 4 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి.

ఇక ట్రైలర్ ప్రధానంగా ప్రేమ, ఎమోషన్ అంశాలతో సాగుతూ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అలాగే ట్రైలర్ లో నేపథ్య సంగీతంతో పాటు విజువల్స్ చాలా బాగున్నాయి. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :