జెర్సీ ఓవర్సీస్ లో అంత రాబడుతుందా ?

Published on Apr 15, 2019 11:41 am IST


న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా జెర్సీ విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం తో కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ చిత్రం నాని గత చిత్రాలకంటే ఎక్కవ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులు 4కోట్లకు అమ్ముడైయ్యాయని సమాచారం. లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ హక్కులను సొంతం చేసుకుంది.

ఇక నాని కి యూఎస్ లో మంచి మార్కెట్ వున్న ఆయన గత రెండు చిత్రాలు పరాజయం చెందడం కలవరపెట్టే విషయమే. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం క్రికెట్ నేపథ్యంలో రానున్న చిత్రం కావడం ఈ సినిమా కు కలిసోచ్చే అంశాలే. హిట్ టాక్ వస్తే జెర్సీ కి అక్కడ ఈమొత్తాన్ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :