జెర్సీ ట్రైలర్ : మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ ఎమోషనల్ జర్నీ!

Published on Apr 12, 2019 9:15 am IST

మచ్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ చిత్రం యొక్క ట్రైలర్ ఈ రోజు విడుదలైయింది. ఇక ఈ ట్రైలర్ ను ఎమోషనల్ సన్నివేశాలతో నింపేశారు. యంగ్ ఏజ్ లో క్రికెటర్ అర్జున్ , శ్రద్దా శ్రీనాథ్ తో ప్రేమలో పడడం పెళ్లి తరువాత ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండడం , భార్య దగ్గర డబ్బులు తీసుకోవడంతో చులకనైనా అర్జున్ 10సంవత్సరాల తరువాత మళ్ళీ క్రికెటర్ గా తన ప్రస్థానం ప్రారంభించి ఎలా సక్సెస్ అయ్యాడు అనే అంశాలతో ఈట్రైలర్ ను కట్ చేశారు.

ఇక ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ నటన , నేపథ్య సంగీతం , విజువల్స్ బాగున్నాయి. ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :