జెర్సీ విడుదల తేదీ ఖరారు !

జెర్సీ విడుదల తేదీ ఖరారు !

Published on Nov 23, 2018 5:45 PM IST

jersy

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విడుదల తేదీ ఖరారైయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటెర్టైన్మెంట్స్ కొద్దీ సేపటి క్రితం ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 19న విడుదలకానుంది.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు