ప్రీమియర్లతో భారీ ఓపెనింగ్స్ దిశగా ‘జై లవ కుశ’ !

21st, September 2017 - 01:07:28 PM


‘జై లవ కుశ’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ఓవర్సీస్లో కూడా అంతే హైప్ ఉంది. చాలా రోజులుగా అక్కడి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు సినిమా 90 లొకేషనల్లో కలిపి సుమారు 500 స్క్రీన్లలో రిలీజవడంతో ముందురోజు రాత్రి ప్రదర్శింపబడిన ప్రీమియర్ల ద్వారా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండేలా కనిపిస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రాన్ని 5.5 లక్షల డాలర్ల వసూళ్లు లభించాయి. ఈ మొత్తం కలిపితే ఫస్ట్ డే ఓపెనింగ్స్ పెద్ద మొత్తంలో ఉండనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం షోలకు అభిమానుల నుండి పాజిటివ్ టాక్ వినబడుతుండటంతో ఈ ఓపెనింగ్స్ తారక్ పాత రికార్డుల్ని బ్రేక్ చేసేలా ఉండబోతున్నాయి. కెఎస్ బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించారు.