సైరా, వార్ చిత్రాలకు అక్కడ చుక్కలు చూపించిన జోకర్

సైరా, వార్ చిత్రాలకు అక్కడ చుక్కలు చూపించిన జోకర్

Published on Oct 4, 2019 8:41 AM IST

joker

రెండు రోజుల క్రితం మూడు భారీ చిత్రాలు గాంధీ జయంతి సందర్బంగా విడుదల అయ్యాయి. వాటిలో మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి, హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ ల మల్టీ స్టారర్ వార్ చిత్రాలతో పాటు హాలీవుడ్ మూవీ జోకర్ ఉన్నాయి. విశేషమిటంటే ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సైరా, వార్ మరియు జోకర్ చిత్రాలకు పాజిటివ్ రివ్యూ రాడంతో పాటు, వర్డ్ అఫ్ మౌత్ బాగుండటంతో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

ఐతే చెన్నై సిటీలో దేశీయ సినిమాలైనా సైరా, వార్ లకంటే జోకర్ మూవీ ఎక్కువ వసూళ్లు సాధించి ఝలక్ ఇచ్చింది. రెండవ రోజు చెన్నై నగరంలో జోకర్ చిత్రం 19లక్షల వసూళ్లు సాధించగా, సైరా మరియు వార్ చిత్రాలు సరిసమానంగా 14లక్షల వసూళ్లు రాబట్టాయని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా జోకర్ మొదటిరోజు 5.4 మిలియన్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది. భారత్, కొరియా, ఇండోనేషియా, బెల్జియం దేశాలలో కలిపి మొత్తం జోకర్ మొదటి రోజు ఈ ఈమొత్తాని వసూలు చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు