మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రస్టీజియస్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్‌లో చేస్తున్నారు మేకర్స్. అక్కడ మూడు షెడ్యూల్స్ చిత్రీకరిస్తారట చిత్ర యూనిట్. ఇందులోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ జోర్డాన్ షూటింగ్‌తో ఈ చిత్రానికి సంబంధించిన ఔట్ డోర్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అవుట్‌డోర్‌లో చిత్రీకరించే ఈ జోర్డాన్ షెడ్యూల్ ఆఖరిదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్‌లో చిత్రీకరించనున్నారట. వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్ ముగించాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రగడ్ లుక్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన లీన్ లుక్‌లోకి మారాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
