‘క‌ల్కి’ వ‌ర‌ల్డ్ లోకి తీసుకెళ్తున్న నాగ్ అశ్విన్

‘క‌ల్కి’ వ‌ర‌ల్డ్ లోకి తీసుకెళ్తున్న నాగ్ అశ్విన్

Published on Jun 18, 2024 1:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవెల్ లో సెట్ చేశాయి. కాగా పూర్తిగా సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరు ఆడియెన్స్ ను స్ట‌న్ చేయ‌నుంది.

ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ఈ సినిమాకు సంబంధించిన వ‌రుస అప్డేట్స్ తో సంద‌డి చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘భైర‌వ ఆంథెమ్’ వీడియో సాంగ్ ను జూన్ 17న రిలీజ్ చేయ‌గా, అది యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. ఇక తాజాగా ‘క‌ల్కి వ‌ర‌ల్డ్’ లోకి తీసుకెళ్ల‌నున్నాడు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. క‌ల్కి ప్ర‌పంచంలో జ‌ర్నీకి స్వాగ‌తం ప‌లుకుతూ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకోనున్నారు.

దీనికి సంబంధించిన ఫ‌స్ట్ ఎపిసోడ్ వీడియోను నేడు సాయంత్రం 4 గంట‌లకు రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా వెల్ల‌డించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విష‌యాల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆస‌క్తిని చూపుతున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఈ భారీ ప్రాజెక్టులో ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు