‘జూ ఎన్టీఆర్’కు మూడు మిలియన్లు !

Published on Apr 23, 2019 12:00 am IST


తెలుగు స్టార్ హీరోలందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. కొంతమంది హీరోలు తరుచుగా తమ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ నో, లేక తమ టూర్ కు సంబంధించిన విశేషాలనో విషయాలనో.. తమ అభిమానులతో షేర్ చేసుకుంటుండగా.. మరి కొంతమంది హీరోలు రేర్ గా సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన, ఏదొక సందర్భంలో సోషల్ మీడియాని అయితే తప్పని సరిగా యూజ్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ సోషల్ మీడియాలో హీరోల గురించి వివరణ ఇప్పుడు ఎందుకు అంటే.. ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో రోజు రోజుకూ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతొంది. అందుకు నిదర్శనం.. ఆయన ట్విట్టర్ ఎకౌంటే. ట్వీటర్ లో తారక్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ప్రస్తుతం మూడు మిలియన్లకు చేరుకుంది.

అయితే మిగిలిన స్టార్ హీరోలు మూడు మిలియన్ల మార్క్ ను ఎప్పుడో చేరుకున్నారు. కానీ వాళ్లు ఎప్పటినుంచో ట్విటర్ ను వాడుతున్నారు. మొత్తానికి అతి తక్కువ టైంలోనే ఎక్కువ ఫాలోవర్స్ ను కలిగాడు తారక్. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.

సంబంధిత సమాచారం :