“RRR” కి యంగ్ టైగర్ కూడా స్టార్ట్ చేసేసాడట.!

“RRR” కి యంగ్ టైగర్ కూడా స్టార్ట్ చేసేసాడట.!

Published on Jun 24, 2021 9:00 AM IST

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు షూటింగ్ అంతిమ దశకు చేసుకున్న ఈ చిత్రం అనుకున్న ముందే రాజమౌళి స్టార్ట్ చేసేసి ఫినిష్ చేసేసే పనిలో పడ్డారు. మరి ఇదిలా ఉండగా ఇటీవలే సీతా రామరాజు చరణ్ మొదటగా షూటింగ్ లో పాల్గొనగా..

ఇప్పుడు కొమరం భీం ఎన్టీఆర్ కూడా ఈ చిత్రం షూట్ లో అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే తారక్ నిన్నటి నుంచి కానీ ఈ వారంలో కానీ రంగంలో దిగనున్నాడని విన్నాం మరి ఆ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం షూట్ లో నిన్నటి నుంచి పాల్గొన్నాడట.ఇక అలాగే ఇంకొన్ని రోజుల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా జాయిన్ కానుంది. మరి ఈ భారీ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు