‘పటాస్’ ఆడియో విడుదలకి హాజారు కానున్న ఎన్.టి.ఆర్ మరియు బాలయ్య?

‘పటాస్’ ఆడియో విడుదలకి హాజారు కానున్న ఎన్.టి.ఆర్ మరియు బాలయ్య?

Published on Dec 4, 2014 2:49 AM IST

blakrishna-ntr
తాజా సమాచారం ప్రకారం ఈ నెల 7న విడుదల కానున్న ‘పటాస్’ ఆడియో రిలీజ్ కి జూ. ఎన్.టి.ఆర్ మరియు బాలయ్య హాజారుకానున్నారు. అదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ‘పటాస్’ ఆడియో రిలీజ్ కి హాజారయ్యి ఈ ఈవెంట్ ని విజయవంతం చేయడానికి నందమూరి హీరోలు రెడీగా వున్నారని సమాచారం.

సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ కాప్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన పంజాబీ బ్యూటీ శృతి సోది హీరోయిన్ గా నటిస్తుంది. ‘పటాస్’ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు