ఎన్టీఆర్ ఘాట్ సందర్శన విరమించుకున్న జూనియర్ ఎన్టీఆర్

Published on May 27, 2020 11:57 am IST

రేపు నందమూరి రామారావుగారి జయంతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ నిభందనల కారణంగా ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామూహిక వేడుకల నిర్వహణను ప్రభుత్వాలు నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ రేపు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్సించ కూడదని నిర్ణయించుకున్నారు. వారు బయటికి వెళితే జన సమూహాలు ఏర్పడే అవకాశం కలదు. దీనితో ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించాలనుకున్న నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారు.

తాత స్వర్గీయ రామారావు గారికి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ ఇంటివద్దే నివాళులు తెలుపనున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు ప్రకటన చేయడం జరిగింది. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి మరియు వర్థంతి నాడు అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఘాట్ సందర్శించడం జూనియర్ ఎన్టీఆర్ కి ఆనవాయితీగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా దానికి కొంచెం బ్రేక్ పడింది.

సంబంధిత సమాచారం :

More