‘ఎన్టీఆర్ – త్రివిక్రమ్’ కథ మారిందా ?

Published on Mar 22, 2021 6:57 am IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రెగ్యులర్ మూస కథలకు తనదైన శైలి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసి, తన సినిమాలను సూపర్ హిట్ చేస్తుంటాడు. అయితే, ఇక నుండి కొత్త కథలను మాత్రమే సినిమాలుగా తీస్తా అని, తానూ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథను కూడా మార్చాడట త్రివిక్రమ్. అలాగే కథలో హీరో క్యారెక్టర్ కూడా చాల కొత్తగా ఉంటుందని, అన్ని ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సినిమాని నడిపించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.

అయితే త్రివిక్రమ్ లో మార్పు రావడానికి ముఖ్యంగా లాక్‌ డౌన్ టైమ్‌లో మన తెలుగు ప్రేక్షకులు విదేశీ చిత్రాలు, సిరీస్‌లు, దేశీయ సిరీస్‌లు చూడటమేనట. మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను రాజకీయాలకి ముడిపడి రాసాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :