మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డ్రాగన్” కోసం అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఊహించని మేకోవర్ లోకి మారిన సంగతి తెలిసిందే. చాలా సన్నగా సిక్స్ ప్యాక్ లుక్ ని తాను ఈ సినిమాకి రెడీ చేసి షాకిచ్చాడు.
అయితే ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం తారక్ మరో ఊహించని మేకోవర్ లో కనిపించనున్నాడట. ఇప్పుడు సన్నటి లుక్ నుంచి నెక్స్ట్ బరువు పెరిగి బల్క్ బాడీ తో ఫిట్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. దీనితో ఈ ఒక్క సినిమాలోనే తన నుంచి రెండు షాకింగ్ వెరియేషన్స్ ని మనం చూడొచ్చని చెప్పాలి. మరి వీటితో ప్రశాంత్ నీల్ తారక్ ని ఎలా ప్రెజెంట్ చేయనున్నాడో చూడాల్సిందే.


