ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయికలో భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తారక్ కొత్త టర్న్ తీసుకోబోతున్నారు.

అయితే ఇటీవల డ్రాగన్ షూట్ లో తగిలిన గాయంతో ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న తారక్ కి మరో హృదయ విదారక అనుభవం ఎదురైంది. తన పెంపుకు కుక్క బఘీర తనని వీడి వెళ్లిపోవడంతో తారక్ విపరీతంగా ఎమోషనల్ అయిపోయారు. సోషల్ మీడియాలో తన బఘీర తనని వీడి వెళ్లిపోవడంతో ఒక ఎమోషనల్ మెసేజ్ ని విడిచిపెట్టారు.

“బఘీరా, నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చి, నిశ్శబ్దంగా మా కుటుంబంలో ఒక భాగమయ్యావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి మరియు నువ్వు మాత్రమే ఇవ్వగల ఒక రకమైన ఓదార్పుతో నా ఇన్ని రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నాకు పూడ్చలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది, కానీ నువ్వు వదిలి వెళ్ళిన ప్రేమ కూడా అంతే పెద్దది. నన్ను ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, మరియు ఈ నాలుగేళ్ళను అనంతంగా మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరుగెత్తు, నా చిన్నారి. నిన్ను ఎంతో ప్రేమించాము, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము.” అని తారక్ చేసిన ఎమోషనల్ పోస్ట్ తన అభిమానులని డాగ్ లవర్స్ ని కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేసింది.

Exit mobile version