సోషల్ మీడియాలో ఇంకాస్త యాక్టివ్ అయిన ఎన్టీఆర్ !
Published on Jun 13, 2018 5:20 pm IST

ప్రస్తుతం సోషల్ మీడియాదే హావా అంతా. ఏ విషయాన్నైనా జనాలకు చేరవేయడానికి ఈ మాధ్యమాన్నే వాడుకుంటున్నారు అందరూ. దీనికి సినిమాలు, సినీ తారలు మినహాయింపు ఏం కాదు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా మీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు హీరో హీరోయిన్లు. ఇప్పటికే పలువురు నటీనటులు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ వంటి మాధ్యమాల్లో హుషారుగా ఉంటూ అభిమానులకు, ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

ఇప్పుడు స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ కూడ ఇదే ఫాలో అవుతున్నారు. చాన్నాళ్ల నుండి ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ అభిమానులకు దగ్గరగా ఉన్న ఆయన ఇప్పుడు ఇన్‌స్టాగ్రమ్ లో కూడ చేరారు. దీంతో అభిమానులకు ఆయన్ను ఇంకాస్త సన్నిహితంగా ఫాలో అయ్యే అవకాశం దొరికింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్న ఆయన అది పూర్తికాగానే రాజమౌళి సినిమాను మొదలుపెట్టనున్నారు.

 

https://www.instagram.com/tarak9999official/

 
Like us on Facebook