నేను లావు ఆవడానికి ఆమె కూడా ఓ కారణమే – ఎన్టీఆర్

నేను లావు ఆవడానికి ఆమె కూడా ఓ కారణమే – ఎన్టీఆర్

Published on Jul 29, 2018 5:28 PM IST

NTR3

నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో రాహుల్ విజ‌య్ హీరోగా వస్తున్న ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఘనంగా ఆడియోను లాంచ్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే స్టార్స్‌ కు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేసిన ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ తనయుడే రాహుల్ విజ‌య్. కాగా ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా పని చేశారు. ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగానే ఎన్టీఆర్ ఆడియో లాంచ్ చెయ్యటానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఫైట్ మాస్ట‌ర్స్, ఫైటర్స్ గురించి వాళ్ళు పడే కష్టం గురించి చెప్తూ.. ఫైట్ మాస్టర్ విజయ్ తో తనకున్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఎన్టీఆర్. అందులో ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తాను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడినని, అలా ఉండడానికి గల కారణాల్లో ఫైట్ మాస్టర్ విజయ్ గారి సతీమణి సుమతిగారు కూడా ఓ కారణమని, ఏం అడిగినా ఆమె చాలా చక్కగా వండి పెట్టేవారని అలా నేను లావు అవడానికి ఆమె చేతి వంట కూడా ఓ కారణమని ఎన్టీఆర్ తెలిపారు.

తాజా వార్తలు