ఎన్.టి.ఆర్ – పూరి సినిమా టైటిల్ ‘టెంపర్’.?

ఎన్.టి.ఆర్ – పూరి సినిమా టైటిల్ ‘టెంపర్’.?

Published on Jul 7, 2014 1:18 PM IST

jr-ntr-puri-jaganath

చాలా కాలం తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ సినిమాకి సంబందించి రోజుకో టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘నేనో రకం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘టెంపర్’ అనే టైటిల్ ని ఈ చిత్ర టీం ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకూ ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈనెలాఖరులో ఈ సినిమాని లాంచనంగా ప్రారంభించి ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఎన్.టి.ఆర్ తో ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ అందించిన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు