
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు అనగా మే 20న రభస ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నారని ఇదివరకే మేము తెలియజేశాం. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం తారక్ తన ఆభిమానుల కోసం ఫస్ట్ లుక్ ఫోటోలతో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. టీజర్ కూడా విడుదల చేస్తున్నారని తెలియడంతో ఎన్.టి.ఆర్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.
ఎన్.టి.ఆర్ – సమంతలు జోడీగా వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

