తారక్ ఈ యంగ్ డైరెక్టర్ తో ఇంకా కన్ఫర్మ్ కాలేదట.!

Published on Jun 5, 2021 12:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ప్రధాన పాత్రలతో రాజమౌళితో భారీ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో రెండు సినిమాలు ఓకే చేసేసి వాటి షూట్ కోసం కూడా సిద్ధంగా ఉన్నాడు.

అయితే ఈ చిత్రాలు లైన్ లో ఉండగానే మరో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తో సినిమా చేయనున్నాడని ఆమధ్య టాక్ ఊపందుకుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ కూడా చేసేశాడని తెలిసింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ఇంకా ఈ కాంబోలో సినిమా కన్ఫర్మ్ కాలేదట.

ప్రస్తుతానికి ఇంకా స్క్రిప్ట్ వర్క్స్ లోనే నడుస్తున్న ఈ చిత్రం ఆ వర్క్ అంతా అయ్యాక తారక్ మరోసారి విని కన్ఫర్మ్ చెయ్యాల్సి ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంపై మరింత సమాచారం రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :