NTR NEEL: మ్యాన్ ఆఫ్ మాసెస్ షార్ప్ లుక్స్ వైరల్..!

NTR NEEL

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా ప్లానింగ్ ప్రకారం పూర్తవుతుంది. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఆ మధ్య అంతా తారక్ లుక్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి కానీ నెమ్మదిగా వాటిని అలవాటు చేసుకున్నారు.

ఇక ఈ స్లిమ్ లుక్ లోనే ఈ మధ్య తారక్ లుక్స్ మరింత వైరల్ అవుతున్నాయి. గడ్డం పెంచి మంచి షార్ప్ ఫిజిక్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ మైంటైన్ చేస్తున్నాడు. నేడు బయటకి వచ్చిన లుక్స్ లో కూడా మంచి స్టైలిష్ గా కూడా కనిపించడంతో ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో కానీ తారక్ కొత్త మేకోవర్ తో మాత్రం ఫ్యాన్స్ హ్యాపీ గానే ఇప్పుడు ఉన్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version