జూనియర్ ఎన్టీఆర్ వస్తాడనుకుంటే కొడుకొచ్చాడు

Published on Aug 15, 2019 11:30 am IST

నేటి స్వతంత్ర దినాన్ని పురస్కరించుకొని ప్రతిష్టాత్మ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం నుండి ఏదైనా ఆసక్తికర అప్డేట్ వస్తుందని అందరూ భావించారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు వంటి ఇద్దరు ఉద్యమవీరులకు సంబంధించిన చరిత్ర కావడంతో, హీరోలుగా నటిస్తున్న చరణ్ లేక ఎన్టీఆర్ లుక్ విడుదల అవుతుందని ఆశపడటం జరిగింది. ఐతే ఉదయం నుండి అలాంటి దాఖలాలేమి కనిపించకపోవడంతో అభిమానులు ఆశలు వదిలేశారు.

ఐతే ఆసక్తికరంగా నేడు జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన సుభాష్ చంద్ర బోస్ గెటప్ లో సెల్యూట్ చేస్తూ ఉన్న అభయ్ ఫోటో ఆసక్తికరంగా ఉంది. దీనితో ఎన్టీఆర్ కొమరం భీం గెటప్ లో వస్తారనుకొంటే, కొడుకు అభయ్ బోస్ గెటప్ లో వచ్చాడంటూ చెప్పుకొంటున్నారు.

సంబంధిత సమాచారం :