షాకింగ్ న్యూస్: జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. అభిమానుల్లో ఆందోళన!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయానికి గురయ్యాడు. ఈ సాయంత్రం ఆయన భుజానికి తీవ్ర గాయమైనట్లు అధికారికంగా వెల్లడించారు. వెంటనే ఆయనను పరీక్షించిన వైద్యుల బృందం డాక్టర్ జె. మధుసూదన్ రావు మరియు డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 6 నుండి 8 వారాల పాటు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కంగారు పడాల్సిన పని ఏమాత్రం లేదని ఎన్టీఆర్ టీమ్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యం క్షేమంగానే ఉందని, రికవరీ సరైన క్రమంలో సాగుతుందని హామీ ఇచ్చారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు రికవరీ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు అధికారికంగా వెల్లడిస్తామని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. అభిమానులు మరియు సినీ వర్గాలు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version