తారక్ లేటెస్ట్ షోకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్.?

Published on Mar 17, 2021 4:01 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక పక్క భారీ చిత్రంలో నటిస్తుండడంతో పాటుగా మళ్ళీ చాలా కాలం అనంతరం తన మార్క్ యాంకరింగ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు నాట టాప్ చానెల్స్ ఒకటైన జెమినీ ఛానెల్లో ప్లాన్ చేసిన లేటెస్ట్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో మళ్ళీ తెలుగు బుల్లితెర వీక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. మరి ఇటీవలే సూపర్బ్ ప్రోమోతో ముందుకొచ్చి అలరించిన యంగ్ టైగర్ అతి త్వరలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడు.

అయితే ఇప్పుడు ఈ గ్రాండ్ రియాలిటీ షోకు తారక్ అందుకుంటున్న రెమ్యునరేషన్ పై తాజా టాక్ వినిపిస్తుంది. కేవలం 55 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ షోకు గాను తారక్ ఏకంగా 11 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడట. అయితే అప్పుడు 70 రోజులకు పైగా ప్లాన్ చేసిన బిగ్ బాస్ షో కు కూడా అంతకు మించిన స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే.కానీ జస్ట్ 55 ఎపిసోడ్స్ షోకి 11 కోట్లు అంటే భారీ మొత్తమే అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ టాక్ అలా గట్టిగానే స్ప్రెడ్ అవుతుంది మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

సంబంధిత సమాచారం :