‘వార్ 2’.. ఈ అంశంలో సర్ప్రైజ్ చేయనున్న ఎన్టీఆర్

‘వార్ 2’.. ఈ అంశంలో సర్ప్రైజ్ చేయనున్న ఎన్టీఆర్

Published on Apr 18, 2025 9:02 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో తాను సాలిడ్ రోల్ చేస్తున్న చిత్రం “వార్ 2” ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ తో ఎన్టీఆర్ నటిస్తుండగా దీనిని బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి వారికి మంచి ఎగ్జైటింగ్ గా అనిపించే న్యూస్ ఒకటి తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసే యాక్షన్ సన్నివేశాలు నెవర్ బిఫోర్ గా ఉంటాయట. మెయిన్ గా కంప్లీట్ బాలీవుడ్ టేకింగ్ లో తారక్ ఇమిడిపోయాడు అని తెలుస్తుంది. తనపై స్టంట్స్ అన్నీ కూడా ఇది వరకు అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ ని చూసినట్టు ఉండదట. ఒక కొత్త తారక్ ని అది కూడా ఒక పర్ఫెక్ట్ స్టంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ట్రీట్ ని ఫ్యాన్స్ ని తాను నెవర్ బిఫోర్ లెవెల్లో అందిస్తాడని తెలుస్తుంది. మరి మొత్తానికి వార్ 2 లో మ్యాన్ ఆఫ్ మాసెస్ అందరికీ ఆశ్చర్యపరచనున్నాడని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు