ఫుల్ స్వింగ్ లో “దేవర”

ఫుల్ స్వింగ్ లో “దేవర”

Published on Jul 6, 2024 8:00 AM IST

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా ఇపుడు రిలీజ్ దగ్గరకి వస్తున్నా కొద్దీ మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఓ పక్క షూటింగ్ ఈ సినిమా విషయంలో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి రీసెంట్ గానే మెయిన్ లీడ్ నడుమ భారీ సెట్స్ నడుమ క్రేజీ సాంగ్ ని షూటింగ్ చేయగా ఈ తర్వాత సైఫ్ అలీఖాన్ తో కొన్ని సన్నివేశాల షూటింగ్ లో ఇప్పుడు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో శరవేగంగా షూటింగ్ పూర్తవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు