వరద బీభత్సం నేపథ్యంలో రానున్న భారీ విజువల్ చిత్రం !

వరద బీభత్సం నేపథ్యంలో రానున్న భారీ విజువల్ చిత్రం !

Published on Sep 23, 2018 10:01 AM IST


కొన్ని రోజులు క్రితం కేరళలో వరద బీభత్సం కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోయిన విషయం తెలిసిందే. వారి బాధకి అన్ని సినీరంగాల ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేశారు. ఇప్పుడు ఒక దర్శకుడు వారి పడిన బాధను, ఇబ్బందికర పరిస్థితులను తెర మీదకు తీసుకురానున్నాడు. ఆయనే మలయాళ దర్శకుడు జూడ్‌ ఆంటొనీ జోసెఫ్‌. ఈ వరదల నేపథ్యంలో తీయబోయ్యే సినిమాకు ‘2043 ఫీట్‌’ అనే పేరును కూడా అనౌన్స్‌ ఖారారు చేశారు.

కాగా ఈ చిత్రం ఎందుకు తీయాలనుకున్నారో దర్శకుడు వివరిస్తూ.. ‘కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈ వరదల పై ఏదైనా ఇన్‌స్పైరింగ్‌ గా ఓ వీడియో తీయమని కోరాయి. కానీ నాకు మాత్రం సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది. మన తర్వాత తరాలకు ఎన్నో ప్రేరణ తెప్పించే కథలును ఈ వరదల నేపథ్యంలో చెప్పాలి అనిపించింది. ఆయితే బాధితుల సహాయార్థాల నిమిత్తం పాల్గొన్న ప్రతి ఒక్కరూ నా దృష్టిలో సూపర్‌ హీరోలే. ఈ చిత్రానికి చాలా గ్రాఫిక్స్ పని ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని దర్శకుడు తెలిపారు.

చుట్టూ పొంచి ఉన్న వరద నీరు, సరైన ఆహారం వసతి లేని పరిస్థితిలో, ఇంకా ఎలాంటి ముప్పు వస్తుందోననే భయంతో ప్రజలు పడిన తీవ్ర ఇబ్బందులను, వారు ఎదురుకున్న సంఘటనలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు