అక్టోబర్ 6వరకు జైల్లోనే రియా చక్రవర్తి

Published on Sep 22, 2020 8:10 pm IST


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, బాలీవుడ్ డ్రగ్స్ వివాదాల్లో నటి రియా చక్రబర్తి ప్రధాన ఆరోపణలు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల సరఫరా ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియాను సెప్టెంబర్ 9న రిమాండ్ కు తరలించారు. కోర్టు విధించిన రెండు వారాల గడువు ఈరోజుతో ముగియడంతో ఎన్‌డీపీఎస్ కోర్టు ఆ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రియా ఇంకో రెండు వారాలు కస్టడీలోనే ఉండనుంది. ఈ రెండు వారాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు రియాను విచారించనున్నారు.

రియాతో ఆమె సోదరుడు షోవిక్ కస్టడీ కూడ అక్టోబర్ 6వరకు పొండిగించారు. మరోవైపు
రియా తరపున లాయర్ బెయిల్ కోసం ముంబై హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ 23 అనగా రేపు విచారణకు రానుంది. ఇప్పటికే పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. మరి రేపైనా ఆమెకు బెయిల్ మంజూరు అవుతుందో లేదో చూడాలి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ కేసుగా టర్న్ తీసుకోవడంతో మొత్తం బాలీవుడ్ పరిశ్రమ హడలెత్తిపోతోంది. ఇంతవరకు రియా కొందరు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించగా ఇక మీదట ఇంకెన్ని పేర్లు బయటికొస్తాయోననే ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు పరిశ్రమలోని ప్రముఖుల మధ్యన నడుస్తున్న ఆరోపణల పర్వం వాతావారణాన్ని మరింత వేడెక్కిస్తోంది.

సంబంధిత సమాచారం :

More