విజయ్ వల్ల నా బిడ్డను కోల్పోయా – నటి జూలీ

విజయ్ వల్ల నా బిడ్డను కోల్పోయా – నటి జూలీ

Published on Jun 2, 2026 11:09 AM IST

‘విజయ్’ తమిళ స్టార్ హీరో నుంచి ఇప్పుడు తమిళనాడు సీఎంగా మారిపోయాడు. పైగా ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక ప్రజలకు తనదైన సేవ చేస్తున్నాడు. సీఎం విజయ్ కారణంగా తన కడుపులో శిశువు చనిపోయిందని నెగిటివ్ కామెంట్స్ చేసింది. బుల్లి తెర నటి జూలీ.. ఈ నటి ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ను వ్యతిరేకిస్తూ ప్రచారం చేసింది. ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆమె పై ట్రోల్స్ చేశారు.

ఈ ట్రోల్స్ పై తాజాగా జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నాపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మితిమీరడంతో నేను తట్టుకోలేక కొందరి పేర్లతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. పైగా రూ.15 లక్షల కిడ్నీ స్కామ్‌ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఎదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఈ ట్రోల్స్ కారణంగా మానసికంగా ప్రశాంతత కోల్పోయాను. చివరకు నేను నా కడుపులో బిడ్డను కోల్పోయాను. ప్రతక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇందులో విజయ్ హస్తం ఉంది’ అంటూ జూలీ కామెంట్స్ చేసింది.

తాజా వార్తలు