బాలయ్య, ఎన్టీఆర్ ఒకే వేదికపై..ఫ్యాన్స్ కి పండగే..!

Published on Jun 6, 2020 7:34 am IST

ఈనెల 10న బాలయ్య ఫ్యాన్స్ సందడి చేయనున్నాడు. ఆ రోజున నందమూరి నటసింహం బాలయ్య 60వ వసంతంలోకి అడుగిడనున్నారు. ఇది షష్ఠి పూర్తి కూడా కావడంతో పెద్ద ఎత్తున్న నిర్వహించాలని ఫ్యాన్స్ ఆలోచనలో ఉన్నారు. ఇక బాలయ్య తన నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు చిత్ర ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఐతే ఈ వేడుకలో ఎన్టీఆర్ ప్రత్యేకంగా నిలవనున్నాడు. బాలయ్య మరియు ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతుంది. బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ కలిసి బాలయ్యకు ప్రత్యేక బహుమతి ఇచ్చే అవకాశం కలదు. దీనితో జూన్ 10న జరిగే ఈ వేడుక కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More