మేమందరం ఆచార్య కోసం ఎదురు చూస్తున్నాం… “ఎవరు మీలో కోటీశ్వరులు” లో ఎన్టీఆర్!

Published on Aug 23, 2021 12:02 am IST

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న తాజా కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం నేడు గ్రాండ్ గా ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం లో రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ పలు ప్రశ్నలను సంధించారు.

ఈ కార్యక్రమం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను ఆచార్య గురించి అడిగిన ప్రశ్నలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. ఆచార్య చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అంటూ రామ్ చరణ్ ను ఎన్టీఆర్ అడగగా, నాన్న తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా మెమరబుల్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ గారికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యల కి ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ, మేమందరం ఆచార్య కోసం ఎదురు చూస్తున్నాం అని అన్నారు. గతం లో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం లో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆచార్య లో నటిస్తుండగా, మరొక చిత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :