హైదరాబాద్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్!

హైదరాబాద్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్!

Published on Jun 12, 2024 10:01 PM IST

గత కొన్ని రోజులుగా స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ దేవర గోవా షెడ్యూల్‌లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ ఈ పాన్ ఇండియన్ చిత్రానికి దర్శకుడు మరియు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. జనతా గ్యారేజ్‌ తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా దేవర. ఈ గోవా షెడ్యూల్‌లో ప్రధాన నటీనటులు పాల్గొన్న కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. సుదీర్ఘ షెడ్యూల్ ఇప్పుడు ముగిసింది. నేడు ఎన్టీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 మరియు దేవర చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. దేవర అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వార్ 2 సినిమా 2025 ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రాలతో పాటుగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమాని కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరం చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు