ఈ గుండెని మరొక్కసారి తాకిపో..తాతా-ఎన్టీఆర్

Published on May 28, 2020 7:02 am IST

తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కసరించుకొని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తాతపై తనకున్న ప్రేమను చాటుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.., మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది…, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. ‘ అని భావొద్వేగ సందేశం పోస్ట్ చేసారు. తాత గారిని జూనియర్ ఎన్టీఆర్ ఎంతగా మిస్ అవుతుంది అనేది ఆయన ట్వీట్ లో అర్థం అవుతుంది.

ఇక ప్రతి ఏటా జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించడం జూనియర్ ఎన్టీఆర్ కి అలవాటు. ఐతే లాక్ డౌన్ కారణంగా ఆయన ఈ ఆలోచన విరమించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా గుంపులుగా చేరడం మంచిది కాదని ఆయన తన నివాసంలోనే తాతగారికి నివాళులు అర్పించనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహితులు నిన్న తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

More