రేపే ‘జ్యోతి లక్ష్మీ’కి రిలీజ్.!

రేపే ‘జ్యోతి లక్ష్మీ’కి రిలీజ్.!

Published on May 7, 2015 6:24 PM IST

Jyothilakshmi
డాషింగ్ డైరెక్టర్ అన్న పేరును సార్ధకత చేసుకునేలా పూరి జగన్నాధ్ తన స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ వరకూ ఇలా అన్నిటిలోనూ ఎక్కడా వేగంగా తగ్గకుండా చక చకా సినిమాని ఫినిష్ చేస్తాడు. అలా షూటింగ్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే పూరి షూటింగ్ పూర్తి చేసిన మరో సినిమా ‘జ్యోతి లక్ష్మీ’. ఇన్ని రోజులు ఎంతో మంది స్టార్ హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన పూరి జగన్నాధ్ మొదటి సారి ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో చార్మింగ్ గర్ల్ ఛార్మీ కి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టేలా ప్లాన్ చేసాడు. ఫిబ్రవరి 20న మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 29తో ముగిసింది.

ఇప్పటికే పలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని మరియు టైటిల్ లోగోని ని రిలీజ్ చేసారు. కానీ సినిమాలో చార్మీ జ్యోతి లక్ష్మీగా ఎలా ఉండనుందనే ఫస్ట్ లుక్ ని మాత్రం రిలీజ్ చెయ్యలేదు. అందుకే ఈ చిత్ర టీం ఛార్మీ జాతి లక్ష్మీ ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు