రాజకీయాల్లోకి స్టార్ హీరో సతీమణి ?

Published on Jun 28, 2019 1:00 am IST

తమిళ్ స్టార్ హీరో సూర్య సతీమణి మాజీ హీరోయిన్ జ్యోతిక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో వచ్చిన జ్యోతిక.. మరో రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా జ్యోతిక గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ వార్త సారాంశం ఏంటంటే.. జ్యోతిక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తోందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

ఇక మరో రెండేళ్లలో తమిళనాడుకు ఎన్నికలు జరగబోతున్నాయి. జ్యోతిక ఓ ప్రధాన పార్టీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుందట. అయితే, ఆ పార్టీ స్టాలిన్ పార్టీనే అని సమాచారం. ఎలాగూ మంచి పనులు చేస్తారని సూర్య ఫ్యామిలీకి తమిళంలో మంచి పేరు వచ్చింది. మరి ఆ పేరుతో జ్యోతిక రాజకీయాల్లో రాణిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More