ఆగష్టులో ‘పవర్’ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్న ‘ఝాన్సీ’

Published on Aug 12, 2018 12:30 pm IST

వైవిధ్యమైన దర్శకుడు బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘నాచియార్’ చిత్రం. కాగా తాజాగా ‘ఝాన్సీ’ పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కాబోతుంది. డి.అభిరాం, కోనేరు కల్పన ‘కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ పతాకాల’ పై సంయుక్తంగా ఆగస్టు 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా యువ నటుడు జి వి ప్రకాష్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే తాజాగా జ్యోతిక నటిస్తోన్న మరో చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ కీలకమైన పాత్రను పోషిస్తుండగా తమిళ్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబరు 18వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రాధా మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోఫ్తా మీడియా వర్క్స్‌ పతాకం పై ధనుంజయన్‌ గోవింద్‌ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More