కార్తి కి అక్కగా జ్యోతిక !

Published on Apr 14, 2019 4:13 pm IST

నిజ జీవితంలో వదిన , మరిది అయినా జ్యోతిక , కార్తి తమ కొత్త చిత్రంలో అక్క,తమ్ముడిగా కనిపించనున్నారు. విషయానికి వస్తే పాపనాశనమ్(దృశ్యం) ఫేమ్ జీతూ జోసఫ్ దర్శకత్వంలో కార్తి తన తదుపరి చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో జ్యోతిక , కార్తి కి అక్కగా నటించనుంది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్క నున్న ఈ చిత్రవమ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వుంది.

ఇక ఇటీవల ఖైదీ చిత్రాన్ని పూర్తి చేసిన కార్తి ప్రస్తుతం రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో కార్తి కి జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తుంది. ఈ సినిమా పూర్తిచేసి కార్తి, జీతూ జోసఫ్ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం :