చిన్న సినిమాకు పెద్ద దర్శకుడి ప్రశంస

Published on Jun 28, 2019 9:00 pm IST

గత వారం విడుదలైన చిత్రాల్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయంగా నిలిచిన సంగతి తెలిసిందే. గత వారం మొత్తం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవానే కనబడింది. సినీ సెలబ్రిటీల దగ్గర్నుండి ప్రేక్షకుల వరకు అందరూ సినిమా గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా హీరో నవీన్ పొలిశెట్టి నటనకు అంతా ముగ్దులయ్యారు.

ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అడివి శేష్, సందీప్ కిషన్ లాంటి చాలామంది సినిమాను మెచ్చుకోగా తాజాగా సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు సైతం చిత్ర యూనిట్ సభ్యులను కలిసి సినిమా బాగుందని అభినందనలు తెలిపి సినిమాపై తన అభిప్రాయాల్ని వారితో పంచుకున్నారు. దర్శకేంద్రుడు ఇలా స్వయంగా పిలిచి మరీ అభినందించడంతో టీమ్ సభ్యులు థ్రిల్ ఫీలవుతున్నారు. స్వరూప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓవర్సీస్లో సైతం మంచి వసూళ్లనే రాబడుతోంది.

సంబంధిత సమాచారం :

More