పరశురామ్ నా ‘పెళ్లి సంద‌డి’ సినిమాని కాపీ కొట్టాడు – రాఘవేంద్రరావు

Published on Aug 28, 2018 8:59 am IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న రిలీజ్ అయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఓ కార్యక్రమంలో రాఘ‌వేంద్ర‌రావు గీత గోవిందం సినిమా సక్సెస్ పై స్పందిస్తూ.. ‘20 సంవత్సరాల క్రితం అర‌వింద్ నేను క‌ల‌సి ‘పెళ్లి సంద‌డి’ సినిమా తియ్యటం జరిగింది. మ‌ళ్లీ ఇన్నేళ్లకి ‘గీత‌ గోవిందం’ చిత్రం మా చిత్రాన్ని గుర్తు చేసింది. పరశురాం నా ‘పెళ్లి సంద‌డి’ సినిమాని కాపీకొట్టాడు అని ఆయన సరదాగా అన్నారు. ఇంకా దర్శకేంద్రుడు మాట్లాడుతూ ఓ సినిమా దర్శకుడికి నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి ఎంతో ఒత్తిడి ఉంటుంది. అవన్నీ పరశురాంకి కూడా ఎదురయ్యే ఉంటాయి. ఏమైన తను ఇలాంటి ఓ మంచి చిత్రం తీసినందుకు సంతోషంగా ఉందిని తెలిపారు

సంబంధిత సమాచారం :

X
More