ప్రీమియర్ షో పూర్తవ్వకముందే ‘కాలా చిత్రం’ లీక్ !

ప్రీమియర్ షో పూర్తవ్వకముందే ‘కాలా చిత్రం’ లీక్ !

Published on Jun 7, 2018 9:00 AM IST

పా.రంజిత్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా చిత్రం’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఓవర్సీస్లో మాత్రం అభిమానుల కోసం కాస్త ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. అలా సింగపూర్ లో వేసిన షోకి వెళ్ళిన ఒక అభిమాని ఏకంగా ఆన్ లైన్ లో ‘కాలా చిత్రం’ లైవ్ స్ట్రీమింగ్ పెట్టేశాడు. 40 నిమిషాలకు పైగానే ఫేస్ బుక్ లో ‘కాలా చిత్రం’ లైవ్ వచ్చిందట.

ఈ సమాచారాన్ని అందుకున్న సింగపూర్ పోలీసులు వెళ్లి లైవ్ ఇస్తున్న అతన్ని అదుపులోకి తీసుకొని లైవ్ ని ఆపేసారు. పోలీసులు అతన్ని విచారించగా అతను ఏదో ఆకతాయిగా చేసిన చర్యలా తెలుస్తోంది. ప్రీమియర్ షో కూడా పుర్తవ్వకముందే సినిమాను ఇలా లీక్ చెయ్యడం నిజంగా దురదృష్టకరమే..! ఇలా ఇక ఎవ్వరు చెయ్యకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు కామెంట్ల రూపంలో తమ నిరసనను వ్యక్తపరుస్తున్నారు. ఈ పైరసీను రూపుమాపడానికి సినీపరిశ్రమ ఎంత ప్రయత్నిస్తున్నా అది ఇంకా కొనసాగుతూనే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు