‘కాలా’ చెన్నై కలెక్షన్స్ !
Published on Jun 15, 2018 2:31 pm IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కాలా చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్సడ్ టాక్ వచ్చినా చెన్నైలో మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది . ఇప్పటివరకు ఈ సినిమా అక్కడ రూ. 8.24 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేనందున మరియు తమిళనాడులో తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ చిత్రం అక్కడ మంచి షేర్ ను రాబట్టుకొనేలానే ఉంది.

ఇది ఇలా ఉంటే తెలుగులో ‘కాలా’ కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలనే మిగల్చనుంది. రజినీ అల్లుడు ప్రముఖ హీరో ధనుష్ నిర్మాణంలో పా.రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో నానా పటేకర్, హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించారు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook