కర్ణాటకలో అదరగొడుతున్న ‘కాలా’ !

కర్ణాటకలో అదరగొడుతున్న ‘కాలా’ !

Published on Jun 18, 2018 7:27 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదలకు కర్ణాటకలో ముందు అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల రజనీకాంత్ కావేరి నది జలాల ఫై చేసిన వాఖ్యలతో మనస్థాపం చెందిన కన్నడిగులు ఈ చిత్రం అక్కడ రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత రజనీకాంత్ వివరణ ఇవ్వడం అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం అక్కడ కల్లెక్షన్లలో రికార్డు సృష్టిస్తోంది. 11 రోజులకు గాను ఈ సినిమా రూ.12.5కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి టాప్ 5 తమిళ గ్రాసర్ల జాబితాలో చోటు దక్కించుకుంది .

ఒకవేళ ఈ సినిమా అక్కడ రిలీజ్ కాకుండా ఉంటే ఇంత మంచి కలెక్షన్స్ ను మిస్ అయ్యేవారే చిత్ర నిర్మాతలు . ఇక ఈ చిత్రం చెన్నైలో కూడా అదరగొడుతోంది. ‘కాలా’ అక్కడ రూ.10. 29 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో చెన్నై లో 3 సార్లు రూ.10 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన హీరోగా రజనీ రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకుముందు అయన నటించిన’ కబాలి, ఏంథిరన్’ సినిమాలు కూడా రూ.10 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకున్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు