‘కాలా’ ఓవర్సీస్ ప్రీమియర్ వసూళ్ల వివరాలు !
Published on Jun 7, 2018 4:15 pm IST

తమిళ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎంతగానో ఎదురుచూస్తున్నా సినిమా ‘కాలా’. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించడంతో ఈ చిత్రంపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. అందుకే తమిళనాట చిత్రానికి పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ అందాయి. ఇక ఓవర్సీస్లో కూడ భారీ ఎత్తున 322 లొకేషనల్లో విడుదలైంది ఈ సినిమా.

దీంతో అక్కడ కూడ ఓపెనింగ్స్ బాగానే దక్కాయి. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు 6వ తేదీ రాత్రి ప్రదర్శింపబడిన ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 509,502 డాలర్లను రాబట్టుకుంది. ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ రజనీ గత చిత్రం ‘కబాలి’ ప్రీమియర్ వసూళ్లతో పోలిస్తే తక్కువే. గతంలో ‘కబాలి’ ప్రీమియర్స్ నుండి 1.9 మిలియన్ డాలర్లను వసూలు చేసుకుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook