తమిళ న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కు సప్రైజ్ ఇవ్వనున్న స్టార్ హీరో !

Published on Apr 12, 2019 1:00 am IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కాప్పాన్ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. రంగం ఫేమ్ కెవి ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సూర్య యెన్ ఎస్ జి కమాండర్ గా నటిస్తున్నాడు. ఇక తమిళ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కానీ లేదా టీజర్ కానీ విడుదలకానుందని సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు చివర్లో విడుదలకానుంది.

ఇక సూర్య ఈ చిత్రం తోపాటు ప్రస్తుతం తన 38వ చిత్రంలో నటిస్తున్నాడు. సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :