జ్యోతిక చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ !

జ్యోతిక చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ !

Published on Nov 17, 2018 6:26 AM IST

తమిళ సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన తాజా చిత్రం ‘కాట్రిన్ మొళి’ నిన్న విడుదలై మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.

బాలీవుడ్ లో విజయం సాధించిన ‘తుమ్హారీ సులు’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో విద్యాబాలన్ పోషించిన పాత్రలో జ్యోతిక నటించింది. ఇక ఆ పాత్రలో ఆమె ఈజీ గా నటించుకుంటూ వెళ్ళిందట. స్టోరీ ,స్క్రీన్ ప్లే , సాంగ్స్ ఈచిత్ర విజయంలో కీలక పాత్రను పోషించాయట. రాధా మోహన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలోమంచు లక్ష్మి ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు