బాలీవుడ్ విమర్శకులకి ప్రేక్షకుల అక్షింతలు

బాలీవుడ్ విమర్శకులకి ప్రేక్షకుల అక్షింతలు

Published on Jun 24, 2019 7:05 PM IST

‘బాహుబలి’ చిత్రంతో దక్షిణాది సినిమాలపైనే బాలీవుడ్ ప్రేక్షకులు మక్కువ చూపిస్తుంటే, అక్కడి క్రిటిక్స్ మాత్రం సీత కన్ను వేశారు. కావాలనే సౌత్ సినిమాలపై విమర్శలకు దిగడం ఆరంభించారు. ఈ విషయం ‘;అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో రుజువైంది. షాహిద్ కపూర్, కైరా అద్వానీలు జంటగా నటించిన ఈ సినిమాను తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశారు.

ఇదే అక్కడి విమర్శలకులు కొందరికి నచ్చినట్టు లేదు. ట్రైలర్ విడుదలైన రోజే సినిమాకు మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. ‘బాహుబలి, కేజిఎఫ్’ సినిమాను చూసిన హిందీ ప్రేక్షకులు దక్షిణాది దర్శకులను చూసి నేర్చుకోండి అంటూ అక్కడి దర్శకులకి హితవు పలికారు. దానికి తోడు ఏకంగా తెలుగు దర్శకుడు తీసిన డైరెక్ట్ హిందీ సినిమా హిట్టైతే పరిస్థితి ఏమిటని అనుకున్నారో ఏమో కానీ విడుదల రోజే సినిమాపై నెగెటివిటీ స్టార్ట్ చేశారు.

అయినా ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. థియేటర్లకు క్యూ కట్టారు. శుక్రవారం 20.21 కోట్లు, శనివారం 22.71 కోట్లు, ఆదివారం 27.91 కోట్లు.. ఇలా రోజు రోజుకూ వసూళ్లు పెరిగిపోయాయి. ఇంకో రెండు రోజుల్లో సినిమా 100 కోట్ల జాబితాలోకి చేరుతుంది. ఈ ఫలితంతో పక్షపాత ధోరణితో రివ్యూస్ ఇచ్చిన సదరు విమర్శకులకు అక్షింతలు పడ్డట్టైంది. అక్కడి ప్రేక్షకులు సైతం నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి అంతిమ తీర్పు ప్రేక్షకులదే అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు