వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ‘కైలాసపురం కింగ్స్’ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నిర్మాత రాజ్ కందుకూరి, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత రిజ్వాన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా విచ్చేసారు.
ఈ సందర్బంగా నిర్మత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…ఈ సినిమా నేను చూశాను, బాగా నచ్చింది. వైజాగ్ నేపథ్యంలో జరిగే మాస్ ఎంటర్టైన్ సబ్జెక్ట్ ఇది. కంచరపాలెం సినిమా తరహాలో ఈ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయనుంది. ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కైలాసపురం కింగ్స్ లో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత తేజ్ వైజాగ్ మాట్లాడుతూ… నాకు వైజాగ్ అంటే ప్రాణం. వైజాగ్ లో జరిగే చిత్ర షూటింగ్స్ కు నేను హెల్ప్ చేస్తుంటాను.దర్శకుడు కులదీప్ కథ చెప్పగానే నచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది అన్నారు. డైరెక్టర్ కులదీప్ రాజాన మాట్లాడుతూ..నేను రాసుకున్న కథకు హీరో రమేష్ పూర్తి న్యాయం చేశాడు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. నిర్మాత తేజ్ వైజాగ్ గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ సినిమాను బాగా నిర్మించారు అన్నారు.
హీరో రమేష్ మాట్లాడుతూ…,నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రిజ్వాన్ గారికి థాంక్స్. కైలాసపురం అనేది పక్కా మాస్ ఎంటర్టైనర్ అందరికి నచ్చే సినిమా ఇది అన్నారు. హీరోయిన్ గరిమా సింగ్ మాట్లాడుతూ..నాకు కైలాసపురం సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేమలో ఉన్న కొత్త కోణాన్ని ఈ సినిమాలో దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. త్వరలో రానున్న ఈ సినిమా మీకు నచ్చుతుంది అన్నారు.
నటీనటులు: రమేష్ కుర్మాపు,గరిమా సింగ్, ప్రసన్న కుమార్,శ్రీమణి. కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: కులదీప్ రాజన్, మ్యూజిక్: త్రినాధ్ మంతెన.


